క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు

స్వతంత్ర, వెబ్ డెస్క్: రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ ముగిసింది. సుదీర్ఘంగా సాగిన ఈ సీజన్‌లో ఆడిన భారత ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు మళ్లీ రెడీ అయ్యారు. ముందుగా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనున్నారు. జూన్ 7 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ వేదికగా WTC ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. అయితే భారత అభిమానులకు ప్రభుత్వ ఛానల్ దూరదర్శన్ శుభవార్త అందించింది. ఈ మ్యాచును డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌ ద్వారా ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. దీనిపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ మ్యాచ్ గెలిచి టెస్టు ఛాంపియన్లుగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరిగే అవకాశం ఉంది.

భారత్ జట్టు (అంచనా): రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లి, అజింక్య రహానే, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, రవీంద్ర జడేజా, శ్రీకర్‌ భరత్‌, ఇషాన్‌ కిషన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌

అస్ట్రేలియా జట్టు (అంచనా): పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, ఉస్మాన్‌ ఖవాజా, ట్రవిస్‌ హెడ్‌, మార్నస్‌ లబూషేన్‌, కెమరూన్‌ గ్రీన్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, స్కాట్‌ బోలాండ్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, టాడ్‌ మర్ఫీ, నాథన్‌ లయోన్‌, మార్కస్‌ హ్యారిస్‌

Latest Articles

నేడు ఐపీఎల్‌ 2026 ఫైనల్‌ పోరు.. RCB VS GT

ఐపీఎల్ 2026 మెగా ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. 70 లీగ్ మ్యాచులు, 3 కీలక మ్యాచుల తర్వాత జరిగే నేటి ఫైనల్ పోరు కోసం ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. గుజరాత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్