ఈటల ఖబడ్దార్ అంటూ కాంగ్రెస్ నేతల హెచ్చరిక

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ రూ. 25 కోట్లు తీసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఈటల రాజేందర్ పార్టీలు మార్చారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు అందరి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఈటల రాజకీయంగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ గురించి జాగ్రత్తగా మాట్లాడాలని.. ఖబడ్దార్ ఈటల అంటూ షబ్బీర్ హెచ్చరించారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసిన పాల్వాయి స్రవంతి కూడా ఈటల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మునుగోడు బై ఎలక్షన్స్ లో నేతలను విచ్చలవిడిగా కొనుగోలు చేశారని ఆరోపించారు. తక్షణమే ఈటల క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్