ఢిల్లీలోని తుగ్లక్ లైన్ లో ఉన్న అధికారిక నివాసాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఖాళీ చేశారు. అనర్హత వేటు నేపథ్యంలో ఇవాళ్టి(ఏప్రిల్22)లోగా అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. దీంతో తన నివాసంలో ఉన్న వస్తువులన్నింటిని తీసుకుని రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నివాసానికి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బీజేపీ కక్షపూరిత చర్యలకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. కాగా 2019 ఎన్నికల ప్రచారంలో మోదీ ఇంటిపేరును కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయనకు గుజరాత్ లోని సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దాంతో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోయారు.
అధికారిక నివాసం పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
0
378
Previous article
Next article
Latest Articles
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -
- Advertisement -


