కాంగ్రెస్ లోక్‌సభ పెండింగ్ స్థానాలపై కసరత్తు పూర్తి

   లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది. పెండింగ్ అభ్యర్థుల స్థానాలపై కూడా అధిష్టానం కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు గాను 14 స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాలపై తర్జనభర్జన పడుతోంది. మొత్తానికి మూడు స్థానాలపై కూడా క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఎల్లుండి నుంచి తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. నామినేషన్ కంటే ముందే అభ్యర్థు లను ప్రకటించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాదరెడ్డి, మండవ వెంకటేశ్వరావు, మల్లు నందిని పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే కరీంనగర్‌కు వెలిశాల రాజేందర్ రావు పేరును దాదాపు ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన హైదరాబాద్‌ స్థానానికి మహమ్మద్ సమీరుల్లా ఖాన్‌ను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest Articles

పుల్వామా దాడుల సూత్రధారి హతం

పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్‌ హతమైనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్‌ హంజా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్