కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పార్ల మెంట్ అభ్యర్థులు, ఇన్‌ఛార్జి మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రు లు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొ న్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని దిశానిర్దేశం చేశారు. ప్రతీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నవారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలని సీఎం రేవంత్ సూచిం చారు. సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకెళ్లేలా చూసుకోవాలని కోరారు. ప్రతీ రౌండ్ లో కౌంటింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న సీఎం ప్రతీ ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే అక్కడే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిం చారు. ప్రతీ అభ్యర్థి వీటన్నింటిపై అవగాహనతో ఉండాలని సీఎం రేవంత్ తెలిపారు.
అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ సమావేశం
0
252
Previous article
Next article
Latest Articles
నేను బీఆర్ఎస్ కు దూరమవుతున్నానని… మల్లారెడ్డి వ్యాఖ్యలపై చర్చ
మేడ్చల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి వీడియో వైరల్ అయింది. ఒక కార్యకర్త పుట్టిన రోజు వేడుకల్లో మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని.. తనను మర్చిపోతున్నారని అన్నారు. స్వయంగా మల్లారెడ్డి...
- Advertisement -
- Advertisement -


