ప్రచారంలో సీఎం కేసీఆర్ దూకుడు.. నేడు మూడు నియోజకవర్గాల్లో సభలు

స్వతంత్ర వెబ్ డెస్క్:  తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ సభల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. ప్రచార పర్వంలో ఇప్పటికే దూసుకెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులు, పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపడమే లక్ష్యంగా ఆ పార్టీ  అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ మహబూబాబాద్‌, వర్దన్నపేట, పాలేరు సభలకు సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నిర్వహించనున్న తొలి ఎన్నికల ప్రచార బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ శ్రేణులు ఇవాళ కేసీఆర్ సభను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పాలేరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు బీఆర్ఎస్ నేతలు రంగం సిద్ధం చేశారు. దాదాపు 80 వేల మందిని తరలించేలా జనసమీకరణ చేస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పాలేరు సభ అనంతరం మహబూబాబాద్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు.

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్