మరో జైత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో బహి రంగసభతో ఈ ప్రచార భేరి మోగించనున్నారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రచారం సాగించనున్నారు.

ఈ రోజు మధ్యాహ్నం 12.30కు తిరుపతి లోక్‌సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్‌లో నిర్వహించే బహిరంగసభలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్‌లో జరిగే సభలోనూ సీఎం జగన్‌ పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సీఎం జగన్.. ఎన్నికల మలివిడత ప్రచారానికి శ్రీకారం చుడుతుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నయాజోష్‌ నెలకొంది. సీఎం జగన్ రేపు అనకాపల్లి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో.. మధ్యా హ్నం12.30కు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ప్రచారం చేస్తారు. సాయంత్రం గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్‌ పాల్గొని ప్రసంగిస్తారన్నారు.

ఎన్నికల తొలివిడత ప్రచారంలో భాగంగా గతనెల 27న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో మహా­నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఘాట్‌ వద్ద నుంచి సీఎం జగన్‌ ప్రారంభించిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2 వేల 188 కిలోమీటర్ల దూరం సాగింది. ఈనెల 24న శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద ముగిసింది. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2వేల 188 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్ర పొడవునా ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. తాజాగా మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్