తాను చైనాతో చర్చలకు సిద్ధం: దలైలామా

స్వతంత్ర వెబ్ డెస్క్: చైనా తనతో మాట్లాడాలనుకుంటుందని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. టిబెటన్ ప్రజల బలమైన స్ఫూర్తిని గ్రహించిన చైనా తనను సంప్రదించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. తాను చైనాతో చర్చలకు సిద్ధమని అయితే టిబెట్‌ స్వాతంత్య్రం కోరుకోవడం లేదని దలైలామా తేల్చిచెప్పారు. తన 88వ పుట్టినరోజు జరుపుకున్న రెండు రోజుల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చైనా తనతో చర్చించాలనుకుంటే తాను ఎప్పుడు సిద్దమే అని దలైలామా చెప్పారు. తాను ఎల్లప్పుడూ టిబెటన్‌ ప్రజల తరపున మాట్లాడటానికి సిద్ధంగా ఉంటానని.. టిబెటన్ ప్రజల ఆత్మ చాలా బలంగా ఉందని, ఇప్పుడు చైనా కూడా గ్రహించింది కాబట్టే టిబెటన్ సమస్యలను ఎదుర్కోవటానికి, చైనా వారు తనను సంప్రదించాలనుకుంటున్నారని దలైలామా అన్నారు. చైనాతో చర్చలకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాము స్వాతంత్రం కోరుకోవడం లేదని, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగానే ఉండాలని చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నామన్నారు. కానీ ఇప్పుడు చైనా మారుతోందన్నారు.

అధికారికంగానో లేదా అనధికారికంగానో చైనీయులు తనను సంప్రదించాలనుకుంటున్నారన్నారు. తనకు ఎవరిపైనా కోపం లేదని, టిబెట్ పట్ల కఠిన వైఖరిగల చైనా నేతలపై కూడా తనకు కోపం లేదని చెప్పారు. నిజానికి చారిత్రకంగా చైనా బౌద్ధ దేశమని చెప్పారు. తాను చైనాలో పర్యటించినపుడు అనేక దేవాలయాలు, మఠాలను చూశానని చెప్పారు. టిబెట్ సంస్కృతి, మతానికి సంబంధించిన విజ్ఞానం వల్ల ప్రపంచం లబ్ధి పొందుతుందని చెప్పారు. అయితే తాను ఇతర మతాల సంప్రదాయాలను కూడా గౌరవిస్తానని చెప్పారు. ఎందుకంటే ప్రేమ, కారుణ్యాలను పెంచుకోవాలని ఆయా మతాలు తమ అనుచరులకు చెప్తున్నాయన్నారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్