పంచాయతీ ఎన్నికల్లో హింసాత్మకం.. మృత్యువాత పడిన 11 మంది

స్వతంత్ర వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లో శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో 11 మంది మృతి చెందారు. మరణించిన వారిలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాగా, బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన వారితో పాటు సామాన్యులు ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడినవారిలో పోలీసులూ ఉన్నారు. భద్రత కల్పించడంలో కేంద్ర బలగాలు పూర్తిగా వైఫల్యం చెందాయని తృణమూల్ ఆరోపించింది. రాష్ట్రంలో చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులను ధ్వంసం చేశారు.

లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎలక్షన్స్‌ని అధికార తృణమూల్ కాంగ్రెస్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే 2024 ఎన్నికలకు ఇది లిట్మస్ టెస్ట్ లాంటిది. రాజకీయాలనూ శాసించగలిగే స్థాయి ఈ పంచాయతీ ఎన్నికలకు ఉంది. అయితే…ఇవి ప్రశాంతంగా అయితే సాగడం లేదు. ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అల్లర్లు మొదలయ్యాయి. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఘర్షణలు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సులు ఎత్తుకెళ్లారు. కొన్నిచోట్ల వాటిని తగులబెట్టారు. వివిధ పార్టీల కార్యకర్తలు పోలింగ్ బూత్ లలోకి వెళ్లి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.

బెంగాల్ లోని గ్రామీణ ప్రాంతాల్లోని 73,887 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 22 జిల్లా పరిషత్‌లు, 9,730 పంచాయతీ సమితులు, 63,229 గ్రామ పంచాయతీ స్థానాల్లోని దాదాపు 928 స్థానాలకు 2.06 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5.67 కోట్ల ఓటర్లు ఉన్నారు. దాదాపు 600 కంపెనీల కేంద్ర బలగాలు, 70 వేలమంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉన్నారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి, హింసలో గాయపడిన ప్రజలను కలిశారు. ఓటర్లతోనూ సంభాషించారు.

Latest Articles

కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?

నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్