పల్లె పండుగ కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిర్దేశించిన పల్లె పండుగ కార్యక్రమం విజయవంతంగా సాగుతుండటం ఆనందం కలిగిస్తోందని ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని 13వేల326 గ్రామాలలో మొత్తం 30 వేల పనులు చేపట్టాలనే సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సీఎం చంద్రబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. 4,500 కోట్ల ఖర్చుతో చేస్తున్న అభివృద్ధి పనులు గ్రామాల్లో ఉపాధి కల్పిస్తూ పల్లెల్లో మళ్లీ వెలుగులు తెస్తున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఇలాంటి మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పల్లెల్లో సంతోషాలు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.