రాడార్ స్టేషన్ మీద బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందన్నారు మంత్రి సీతక్క. అధికారంలో ఉన్నప్పుడే దామగుండం రాడార్ స్టేషన్‌కు బీఆర్ఎస్ అనుమతిచ్చిందని చెప్పారు. దామగుండం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ జీవో ఇచ్చిందనడానికి అన్ని ఆధారాలున్నాయన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మాట్లాడితే హీరోయిజం అయిందని.. అవే పనులు ఇప్పుడు తాము చేస్తే అడ్డుపడుతున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో మరోలా మాట్లాడటం సరైంది కాదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమ కట్టడాల మీద బీఆర్ఎస్ బుల్డోజర్ పంపించాలని చెప్పలేదా అని సీతక్క ప్రశ్నించారు.