సమగ్ర కుటుంబ సర్వే నివేదికపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వాఖ్యలు చేశారు. 42 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వానికి చిత్త శుద్ది లేదన్నారు. కుల గణన సర్వే నివేదిక చిత్తు కాగితంతో సమానమని కామెంట్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన లెక్కలకు, కుల గణనకు పొంతనే లేదన్నారు. సర్వేలో కులాల వారీగా వివరాలు లేవని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నివేదిక ద్వారా 42 శాతం రిజర్వేషన్ అమలు జరగదని అన్నారాయన.
4 కోట్లకు పైగా ఉండాల్సిన రాష్ట్ర జనాభా.. సర్వేలో తగ్గిందని ప్రశ్నించారు. సర్వే నివేదికలో 40 లక్షల బీసీ జనాభా తగ్గిందని చెప్పుకొచ్చారు. బీసీల జనాభా తగ్గి ఓసీల జనాభా ఎలా పెరిగిందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు తీన్మార్ మల్లన్న.
కులగణన సర్వేలో వివరాలు
రాష్ట్రంలో బీసీల జనాభా- కోటి 64 లక్షల 9 వేలు
రాష్ట్ర జనాభాలో బీసీలు- 46.25 శాతం
ఎస్సీల జనాభా – 61 లక్షల 84వేల 319 మంది
జనాభాలో ఎస్సీలు- 17.43 శాతం
రాష్ట్రంలో ఎస్టీలు – 37 లక్షల 5వేల 929 మంది
మొత్తం ఎస్టీలు జనాభాలో 10.45 శాతం
బీసీ మైనార్జీ ముస్లింలు 35 లక్షల 76వేల 588 మంది
ముస్లిం మైనార్జీలు బీసీలు సహా మొత్తం జనాభా 56.33 శాతం
ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా 2.48 శాతం
ముస్లిం మైనారిటీల జనాభా 12.56 శాతం