వీడెవండి బాబు.. సైకోలకే సైకో లాగా ఉన్నాడు. ఆటలో ఓడిపోయాడని ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు. బ్రెజిల్ కు చెందిన ఎడ్గర్ రికార్డో.. సినోప్ నగరంలోని స్థానిక పూల్ హాల్ లో ఓ వ్యక్తితో పందెం కాసి పూల్ గేమ్ ఆడాడు. అయితే ఆ గేమ్ లో రికార్డో ఓడిపోయాడు. కొంతసేపటి తర్వాత తన స్నేహితుడు రెబిరోతో కలిసి వచ్చి మళ్లీ గేమ్ ఆడగా.. ఆ పందెంలోనూ ఓడిపోవడంతో అక్కడున్న వారు అతడిని చూసి నవ్వారు. దీంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన రికార్డో.. వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పూల్ యజమానితో సహా ఆరుగురు అక్కడిక్కడే చనిపోయారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.