29.2 C
Hyderabad
Monday, May 29, 2023

Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష రేసులో.. భారత సంతతి వ్యక్తి పోటీ

Vivek Ramaswamy | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో భారతీయ సంతతి వ్యక్తి పోటీచేయనున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త, రిపబ్లికన్ పార్టీ నేత అయిన వివేక్ రామస్వామి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంతకుముందుకు భారత సంతతికే చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ(Nikki Haley) కూడా ఈ ప్రకటన చేశారు. తర్వాతి తరం అమెరికన్లకు కొత్త కలలను సృష్టించేందుకు చేస్తున్న ఉద్యమం ఇదని.. అమెరికాకే తన మొదటి ప్రాధాన్యమని ఆయన తెలిపారు. ముఖ్యంగా చైనా నుంచి వస్తోన్న ముప్పును ఎదుర్కోవడంతో పాటు ఆ దేశంపై అమెరికా ఎక్కువ ఆధారపడటాన్ని తగ్గిస్తానని వెల్లడించారు.

వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) అమెరికాలోని ఒహాయా రాష్ట్రంలో ఆగష్టు 9, 1985లో జన్మించారు. కేరళకు చెందిన ఆయన తల్లిదండ్రులు అమెరికా(America) వలస వచ్చారు. హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో రామస్వామి విద్యనభసించారు. తనను తాను క్యాపిటలిస్ట్ గా ఆయన అభివర్ణించుకున్నారు. ఔషదరంగంలో మంచి పేరు సంపాదించుకున్న రామస్వామి.. 2016 ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం 600 మిలియన్ల ఆస్తుల విలువ కలిగి ఉన్నారు. దీంతో 40 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న అమెరికా సంపన్నుల్లో ఒకరిగా నిలిచారు వివేక్ రామస్వామి.

Read Also: తమిళ సూపర్ హిట్ రీమేక్ లో… మామా అల్లుళ్లు

Latest Articles

మణిపూర్‌లో మళ్ళీ చెలరేగిన తిరుగుబాటుదారులు..

స్వతంత్ర వెబ్ డెస్క్: మణిపుర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఒక్క రోజే 40 మంది తిరుగుబాటుదారులను హతమార్చినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్‌...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
250FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్