Delhi Mayor | ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో 34 ఓట్ల తేడాతో బీజేపీ(BJP)పై ఆప్ విజయం సాధించింది. ఆప్ విజయం సాధించడంతో మేయర్ గా షెల్లీ ఒబెరాయ్(Sheli Oberoi) ఎన్నికయ్యారు. అనంతరం ఆప్ నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు. చివరకు ప్రజాస్వామ్యమే గెలిచిందని ఆప్ నేతలు తెలిపారు. సభను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తానని.. సభ సజావుగా జరిగేలా నేతలందరూ సహకరించాలని ఈ సందర్భంగా మేయర్ షెల్లీ వెల్లడించారు.
Delhi Mayor | ఇంతకు ముందు మేయర్, డిప్యూటీ మేయర్, స్టాడింగ్ కమిటీలోని 18 మంది సభ్యులలో ఆరుగురిని ఎన్నుకునేందుకు ఇటీవల మూడుసార్లు సమావేశమైంది. అయితే ఎన్నికల ప్రక్రియ జరగకుండానే సభ వాయిదాపడింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్(LG) అనుమతించడాన్ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తింది. LG నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఆప్ సవాలు చూసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ గత శుక్రవారం తీర్పునిచ్చింది. దీంతో మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.
ఢిల్లీ మున్సిపాలిటీకి గతేడాది డిసెంబర్ 4న ఎన్నికలు జరగగా.. డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. AAP 134 సీట్లు గెలుచుకోగా.. BJP 104 వార్డులు గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 9 సీట్లు దక్కించుకుంది. ఆప్ తరఫున ఢిల్లీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్, బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ పడ్డారు. సుప్రీంకోర్టు తీర్పుతో మొత్తానికి మేయర్ పీఠాన్ని ఆప్ తన ఖాతాలో వేసుకుంది.