Pawan Kalyan | తమిళ సూపర్ హిట్ రీమేక్ లో… మామా అల్లుళ్లు

Pawan Kalyan |  పవన్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా పట్టాలెక్కింది. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ మొదలైంది. ఇది సముద్రఖని తమిళంలో నటించి, దర్శకత్వం వహించిన హిట్ చిత్రం ‘వినోదయం సీతమ్’ కి ఇది రీమేక్ గా వస్తోంది.

ఇందులో పవన్ కల్యాణ్ మోడ్రన్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ప్రమాదంలో గాయపడిన హీరోకి దేవుడు మరో ఛాన్స్ ఇస్తాడు, అదే కాన్సెప్ట్ తో తీసిన సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇక్కడ సాయిధరమ్ తేజ్(Sai dharam Tej) ఆ పాత్రను చేస్తున్నాడు. అయితే యాదృచ్ఛికంగా తనకి కూడా బైక్ ఏక్సిడెంట్ అయి మరణం చివరి వరకు వెళ్లి వచ్చాడు.

అనుకోకుండా అలాంటి కథాంశంతో వచ్చిన సినిమా కాబట్టి, పబ్లిక్ కి కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో బహుశా దర్శకుడు సముద్రఖని భావించి ఉండి, సాయిధరమ్ తేజ్ కి కథ వినిపించడం తను ఓకే చేయడం, ఇందులో అనుకోకుండా దేవుడి పాత్రను పవన్ కల్యాణ్ చేయడానికి ఒప్పుకోవడంతో సినిమాకి ఒక హైప్ క్రియేట్ అయ్యింది. సాయిధరమ్ తేజ్ కి మళ్లీ రీ బ్రేక్ ఇచ్చేందుకు మెగా ఫ్యామిలీ ట్రై చేస్తోందని అంతా అనుకుంటున్నారు.

Pawan Kalyan | పవన్ కల్యాణ్ ఈ సినిమా కోసం 20 రోజులు డేట్స్ ఇచ్చారు. మార్చి నెలాఖరు వరకు షెడ్యూల్ ఉంటుందని అంటున్నారు. అనంతరం ఈ ఏడాది చివరిలో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ ది సినిమాలో కొంతవరకే పాత్ర ఉండవచ్చునని అంటున్నారు.

ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాస్తున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందిస్తున్నారు. ఒకవైపు నుంచి మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్… ఈ సినిమాకి కూడా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు.

హీరోయిన్ గా రొమాంటిక్ సినిమాలో చేసిన కేతికా శర్మ నటించనుంది.

Read Also:

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్