తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. మూడు రోజుల నుంచి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బాంబు పెట్టినట్టు బెదిరింపులకు దిగాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు.. సచివాలయంలో తనిఖీలు చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. అతనిని విచారించగా.. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని తేల్చారు. అయితే అగంతకుడు ఎందుకు ఫోన్ చేశాడన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు