బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్ రాగా.. తాజాగా మరోసారి 2 కోట్ల రూపాయలు ఇవ్వాలని.. లేదంటే సల్మాన్‌ఖాన్‌ను చంపుతామంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు ఈ సందేశాన్ని పంపి బెదిరించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిపారు.
ఇక ఇటీవల కూడా సల్మాన్‌ఖాన్ బెదిరించాడు ఓ ఆగంతకుడు. సల్మాన్‌ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో శత్రుత్వాన్ని ముగించుకోవాలన్నా 5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దని.. డబ్బులు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత అతడు మరో మెసేజ్ పంపాడు. నేను కావాలని బెదిరింపులకు పాల్పడలేదు.. అనుకోకుండా జరిగిపోయింది. క్షమించండని సందేశాన్ని పంపాడు. ఈ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అతగాడి కోసం ముమ్మరంగా గాలించారు. ఝార్ఖండ్ పోలీసుల సాయంతో జంషెడ్‌పూర్ చెందిన ఓ కూరగాయల వ్యాపారి ఇదంతా చేసినట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


