కన్నడ హీరో దర్శన్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. అభిమాని రేణుక స్వామి మర్డర్ కేసులో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. సర్జరీ కోసం ఆరువారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దర్శన్ నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు.
కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు అప్పట్లో హాట్‌టాపిక్‌గా మారింది. రేణుకాస్వామిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతడికి కరెంట్‌షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది.