బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి

స్వతంత్ర వెబ్ డెస్క్: గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి, మునుగోడు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల గడవు మాత్రమే ఉంది. ఈ సమయంలో పార్టీ అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను అధిష్ఠానం నియమించింది.

అయితే బీజేపీ అధిష్టానం కీలకమైన పదవులకు మంగళవారం నియామకాలు చేశారు. ఆ సమయంలో ఏపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డికి జాతీయ కార్యవర్గ సభ్యునిగా పదవి ఇచ్చారు. అయితే అప్పుడు రాజగోపాల్ రెడ్డికి పదవి గురించి ఆలోచించలేదు. ఈ నియామకాల ప్రకటన వెలువడిన తర్వాత … రాజగోపాల్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు. కాంగ్రెస్ లో చేరిన పొంగులేటితో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ లోపే ఆయనకు బీజేపీ హైకమాండ్ జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న పదవిని ప్రకటించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్