సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి సత్తా చాటింది. హ్యట్రిక్ విజయంతో కేంద్రంలో అధికా రాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. దక్షణాదిన పట్టు సాధించాలని ఏళ్లుగా పరితపిస్తున్న బీజేపీకి ఈలోక్‌సభ ఎన్నికలు కలిసొచ్చాయనే చెప్పాలి. తెలంగాణ అనూహ్యంగా 8 స్థానాలు సాధించి అధికార పార్టీకి కూడా చెమటలు పట్టేలా చేసింది.
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సత్తాచాటింది. దక్షణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో తెలంగా ణలో స్పష్టమైన మెజార్టీని కాషాయ పార్టీ సాధించింది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సైతం తలదన్నేలా కాషాయ పార్టీ ఫలితాలను దక్కించు కుంది. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉంటే మెజార్టీ స్థానాలను బీజేపీ సొంతం చేసుకుంది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2, ఎంఐఎం, బీజేపీ, టీడీపీ, వైసీపీ పార్టీలు ఒక్కో స్థానం చొప్పున గెలుపొందాయి. 2019లో బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐ ఎం ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. తాజా ఎన్నికల్లో 4 నుంచి ఏకంగా రెండంకెల స్థానాలకు ఎగబాకింది బీజేపీ. బీజేపీ గెలుపు వెనక బీఆర్‌ఎస్ తోడ్పాటు ఉందనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్‌ను బలమైన పోటీగా భావించిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సహకరించిందనే వాదన ఉంది. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే బీఆర్‌ఎస్ ఈ స్టాండ్ తీసుకుందనే విమర్శలున్నాయి.
ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అనూహ్యమైన ఫలితాలతో అందరి దృష్టినీ ఆకర్షిం చింది బీజేపీ. గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్న బీజేపీ ఈసారి ఏకంగా 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అదే ఒరవడిని పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనబరి చింది. తెలంగాణలో బీజేపీ దూకుడు జీహెచ్ ఎంసీ ఎన్నికల నుంచే మొదలైందని చెప్పాలి. అప్పటి అధికార బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢీ అంటూ తలపడిన బీజేపీ జీహెచ్‌ఎంసీలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఇచ్చిన జోష్‌తో బరిలోకి దిగిన బీజేపీ తెలంగాణ అసెంబ్లీలోనూ చెప్పుకోదగ్గ ఫలితాలను రాబట్టుకుంది. ఇప్పుడు పార్లమెంట్ ఫలితాల్లోనూ అదే స్పీడ్‌ను కనబరిచింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మెదక్ నుంచి మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, భువనగరి నుంచి బూరా నర్సయ్యగౌడ్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తెలం గాణలో బీజేపీ విజయానికి జాతీయ స్థాయిలో మోదీ హవా తోడైందనే చెప్పాలి. తెలంగాణను ప్రతిష్టా త్మకంగా భావించిన బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీజేపీ మెజార్టీ స్థానాలను సొంతం చేసుకోవడంతో.. కాషాయ శ్రేణుల్లో ఆనం దం వెల్లువెత్తుతోంది. త్వరలోనే తెలంగాణలో అధికారం లోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేస్తు న్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు. తాజా ఫలితాలతో తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఏ టర్న్ తీసుకోనుందో చూడాలి.