లోక్ సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌కు, వాస్తవ ఫలితాలకు భారీ తేడా కనిపించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులతో కుప్పకూలాయి. సెన్సెక్స్ ఒక్కరోజే 4 వేల పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ నాలుగేళ్లలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో నష్టాలు చవిచూసింది. ముగింపు సమయానికి సెన్సెక్స్ 4వేల 390 పాయింట్ల నష్టంతో 72వేల 079 వద్ద క్లోజయింది. నిఫ్టీ 1,379 పాయింట్ల నష్టంతో 21 వేల 884 వద్ద ముగిసింది.