MP Venkat Reddy |చెరుకు సుధాకర్ పై బెదిరింపులు.. క్లారిటీ ఇచ్చిన కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ నాయకుడు చెరకు సుధాకర్ కుమారుడుతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(MP Venkat Reddy) మాట్లాడిన ఆడియో లీకవ్వడం, ఆ వీడియోలో వెంకట్‌రెడ్డి బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన వ్యాఖ్యలపై స్పందించారు. అవి తాను భావోద్వేగంతో చేసిన వాఖ్యలేనని, వేరే ఉద్దేశ్యం ఏమి లేదన్నారు. తన ౩౩ ఏళ్ల రాజకీయ జీవితంలో తన రాజకీయ ప్రత్యర్ధులను కూడా ఎవరిని దూషించలేదన్నారు. తన శత్రువులను కూడా దగ్గరకు తీసుకునే తత్వం తనదన్నారు. చెరకు సుధాకర్‌ను తిట్టాలనుకుంటే రెగ్యులర్‌గా ఎందుకు ఫోన్‌ చేస్తానన్నారు. చదువుకున్న వ్యక్తి గా జనరల్ స్థానం అయిన నల్లగొండ మున్సిపాలిటీ ఛైర్మన్ గా వెంకట్ నారాయణ గౌడ్ కు అవకాశం ఇచ్చామని, నల్లగొండ మున్సిపాలిటీ 3 సార్లు జనరల్ అయినప్పటికీ ఆ మూడు సార్లు పట్టుబట్టి బలహీన వర్గాల వారికి దక్కేలా చూశానని తెలిపారు.

తాను మాట్లాడిన కొన్ని విషయాలను కట్‌ చేసి ఆడియో విడుదల చేశారన్నారు. కావాలనే కొన్ని అంశాలను లీక్‌ చేశారని తెలిపారు. తాను మాట్లాడేటప్పుడు రికార్డు పెట్టారనే విషయం తనకు తెలుసని అన్నారు. పార్టీ లో చేరిన నాటి నుంచి చెరకు సుధాకర్ తనను తిడుతున్నాడని ఆరోపించారు వెంకట్‌రెడ్డి.. ఎందుకు తిడుతున్నారని అడిగానని, చెరకు సుధాకర్ పై పీడీయాక్ట్ పెడితే.. తానే కోట్లాడాననే విషయాన్ని కోమటిరెడ్డి గుర్తుచేశారు. తనను తిట్టొద్దని మాత్రమే చెరకు సుధాకర్ కుమారుడుకు చెప్పానన్నారు. ఆ విషయాన్ని అన్యదా భావించొద్దని ప్రజలను కోరుతున్నట్లు కోమటిరెడ్డి తెలిపారు.

తనపై నకిరేకల్‌లో పోస్టర్లు ఎవరు వేశారో తనకు తెలుసని, తన వాళ్లు చంపేస్తారామోననే భయంతో మాత్రమే చెప్పానని వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తనను తిడితే నకిరేకల్‌ టికెట్‌ వస్తుందని అనుకుంటున్నారని, తనను వీడు, వాడు అని సంభోదిస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

 Read Also: నేడు ప్రయివేట్ కాలేజీ యాజమాన్యాలతో మంత్రి సబిత సమావేశం.. ప్రధాన ఎజెండా అదే..

Follow us on:   Youtube   Instagram

Latest Articles

నాతన ధర్మం ట్రెండ్.. మారిందా..?

ఒకప్పుడు ఫ్యామిలీ డ్రామాలు, హర్రర్ కామెడీలు.. ఈ మధ్య పాన్ ఇండియా యాక్షన్ సినిమాల ట్రెండు నడుస్తుంది. అలాగే హిందూ పురాణాల కథలతో సనాతన ధర్మం అంటూ ఓ కొత్త ట్రెండ్ కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్