రూ.500కోట్లతో వన్డే వరల్డ్‌కప్‌ వేదికలకు కొత్త రూపురేఖలు

ODI WC 2023: ఐపీఎల్ ఫీవర్ ముగిసిన వెంటనే దేశంలో వరల్డ్ కప్(Worlcup) మజా మొదలు కానుంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలలో జరగనున్న ప్రపంచ కప్ కు 12సంవత్సరాల తర్వాత భారత్ ఆతిధ్యమివ్వనుంది. వరల్డ్ కప్ లో మొత్తం 48 మ్యాచులు జరగనున్నాయి. దీంతో ఈ టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీసీఐ(BCCI).. మ్యాచులు జరిగే స్టేడియాల లుక్ ను మార్చనుంది. ఇందుకోసం రూ.500కోట్లను కేటాయించింది.

మొత్తం ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేలా కసరత్తు ప్రారంభించింది. ఢిల్లీతో పాటు హైదరాబాద్, కోల్ కతా, మొహాలి, ముంబైలోని వాంఖడే స్టేడియాల్లో వసతులను మెరుగుపర్చనుంది. ఈసారి వరల్డ్ కప్ కు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఆతిథ్యం ఇవ్వనుండడంపై తెలుగు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ స్టేడియం మరమ్మత్తులకు రూ.117.17కోట్లు కేటాయించింది. ఢిల్లీ స్టేడియానికి రూ. 100 కోట్లు, కోత్ కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే స్టేడియం కోసం రూ. 78.82 కోట్లు ఖర్చు పెట్టనుంది. కాగా చివరి సారిగా భారత్ ఆతిథ్యం ఇచ్చిన 2011 వరల్డ్ కప్ ట్రోఫీని ధోని సేన సగర్వంగా ముద్దాడి కోట్లాది మంది భారతీయుల కల నెరవేర్చింది. మళ్లీ 12ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం ఇవ్వనుండడంతో ఈసారి కూడా టీమిండియా ప్రపంచ కప్ టైటిల్ ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్