లైంగిక వేధింపుల వల్లే హత్య.. వివేకా కేసులో కొత్త ట్విస్ట్

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు సునీల్ యాద్ తల్లిపై లైంగిక వేధింపుల కారణంగానే ఆయనను హత్య చేశారని వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది తెరపైకి తెచ్చారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మరో నిందితుడు దస్తగిరికి కిందికోర్టు క్షమాభిక్ష ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులోదాఖలు చేసిన రిట్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.

విచారణ సందర్భంగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ యాదవ్‌ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని కోర్టుకు తెలియజేశారు. తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ కేసు విచారణను ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్