తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల ముందు మహిళలు ఆటపాటలతో బతుకమ్మను పూజిస్తున్నారు. అధికారులు , ఫైల్స్ అంటూ ప్రతి రోజూ బిజి బిజిగా ఉండే సచివాలయం ఈరోజు సందడిగా మారింది. సచివాలయ ఉద్యోగులు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. సచివాలయంలో బతుకమ్మ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని మహిళా ఉద్యోగులు అంటున్నారు. సచివాలయంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకలకు సంబంధించి మా ప్రతినిధి విశాల్ మరిన్ని వివరాలు అందిస్తారు.


