Bandi Sanjay |TSPSC పేపర్ లీక్ వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యోరపణలు చేసుకుంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. పేపర్ లీక్ వెనక మంత్రి కేటీఆర్ హస్తం ఉందని బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం.. ఆ ఆరోపణలను ఖండిస్తూ వారిద్దరికీ కేటీఆర్(KTR) రూ.100 కోట్ల పరువు నష్టం దావా లీగల్ నోటీసులు పంపించడం తెలిసిందే. ఈ నోటీసులపై బండి సంజయ్(Bandi Sanjay) స్పందిస్తూ కేటీఆర్ పరువుకు రూ.100 కోట్లు అయితే.. మరీ 30లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వల్ల నష్టపోయిన యువతకు ఎంత డబ్బులు చెల్లిస్తావని నిలదీశారు. కేటీఆర్ ఉడుత ఊపులకు భయపడే ప్రస్తక్తే లేదని.. నోటీసులను లీగల్‌గా ఎదుర్కొంటామని తెలిపారు.
Read Also: ఫోన్ పే, పేటీఎం యూజర్లకు గుడ్ న్యూస్.. ఛార్జీలు ఉండవు
Follow us on: Youtube, Instagram, Google News