ఆదివారం సెలవు కదా అని సరదాగా కుటుంబం, స్నేహితులతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్ సిబ్బంది చిరాకు తెప్పించింది. హైదరాబాద్ మూసాపేటలో ఉన్న ఏషియన్ లక్ష్మీకళ థియేటర్లో సాయితేజ్ ‘విరూపాక్ష’ సినిమా ప్రదర్శితం అవుతోంది. అయితే మూవీ చూద్దామని సాయంత్రం 6గంటల షోకు వెళ్లగా.. 7.30గంటల వరకు సిబ్బంది సినిమా ప్రదర్శించలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆడియన్స్ థియేటర్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రేక్షకులను అదుపు చేశారు. అసౌకర్యానికి చింతిస్తూ టికెట్లు కొనుగోలు చేసిన వారికి థియేటర్ యాజమాన్యం తిరిగి డబ్బులు చెల్లించింది.
షో ఆలస్యం కావడంతో థియేటర్ ఫర్నిచర్ ధ్వంసం
0
342
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


