రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య వాగ్వాదం

రాజ్యసభలో ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్, ఎంపీ జయా బచ్చన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కించపరిచారంటూ జయాబచ్చన్‌పై.. ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. అయితే జయాబచ్చన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా.. అదే స్థాయిలో మండి పడ్డారు. అంత గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఫలితంగా ఇద్దరి మధ్య ఒక్కసారిగా మాటలయుద్ధం మొదలైంది. తాను ఒక నటినని.. ఎవరి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోగలనన్నారు. ఇలా గట్టిగా మాట్లాడడం సరికాదని.. మీరు ఛైర్మన్ హోదాలో ఉన్నప్పటికీ మనమంతా ఒక్కటేనని జయాబచ్చన్ అన్నారు. ఆమె వ్యాఖ్యలపై జగ్‌దీప్ ధన్‌కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దయచేసి కూర్చోండని మందలించారు. మీరు సెలెబ్రిటీ అయితే అయుండొచ్చని కానీ సభా మర్యాదలు పాటించాలని తేల్చి చెప్పారు.

Latest Articles

ఆపరేషన్‌ రేజ్‌పిల్‌లో “జిహాదీ డ్రగ్” స్వాధీనం.. క్యాప్టగాన్ అంటే ఏమిటి?

భారతదేశంలో భారీ యాంటీ డ్రగ్ ఆపరేషన్‌లో భాగంగా అరుదైన ‘క్యాప్టగాన్’ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) వెల్లడించారు. ‘ఆపరేషన్ రేజ్‌పిల్’ పేరుతో నిర్వహించిన ఈ దాడిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్