ఆదివాసులను అణచివేస్తున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. అడవులను ఆదివాసులు విధ్వంసం చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అడవుల ఆధారంగా బతికే గిరిజనులు అడవులను ఎప్పుడూ నాశనం చేయరన్నారు. అడవులు మిగలడానికి ఆదివాసీలు, అడవి బిడ్డలే కారణమని చెప్పారు. సహజ వనరులు అపారంగా వున్న అడవులను కొల్లగొడుతున్నారని అన్నారు. ఆదివాసీల హక్కులను హననం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో చట్టాలు ఉన్నా అనుకున్న స్థాయిలో ఆ జాతులు అభివృద్ది జరగలేదని తెలిపారు.