క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో రాబోయే కాలంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలంటే మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ వారు మన దేశం నుండి వదిలి వెళ్లాలని శాంతియుతంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని చేయడం జరిగిందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కాలుష్యాన్ని నివారించే చర్యలు తీసుకుని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో, క్విట్ ఇండియా పోరాటంలో బ్రిటిష్ వారి అణిచివేతలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నామన్నారు.