అడవుల సంరక్షణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. అల్లు అర్జున్‌నే టార్గెట్ చేశారా అన్న చర్చ అటు పాలిటిక్స్‌లోనూ, ఇటు సినీ రంగంలోనూ ఆసక్తికర అంశంగా మారింది. అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారంటూ బెంగుళూరు వేదికగా చేసిన ఈ కామెంట్సే అందుకు కారణం.
ఏపీలో ఏనుగులు సృష్టిస్తున్న బీభత్సంపై ఫోకస్ పెట్టిన పవన్‌కల్యాణ్,.. నియంత్రణ చర్యల్లో భాగంగా కర్ణాటక సహాయాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి వెళ్లిన ఆయన.. కర్నాటక సీఎం సిద్దరామయ్యతో చర్చలు జరిపారు. ఏనుగుల్ని నియంత్రించేందుకు అవసరమైన కుంకీ ఏనుగులను అందించాలని కోరారు. ఈ సందర్భంగా వన్య ప్రాణి, అటవీ సంరక్షణ గురించి ప్రస్తావించిన పవన్.. అప్పట్లో హీరోలు అడవులను కాపాడితే, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నారని అన్నారు. 40 సంవత్సరాల క్రితం సినిమాల్లో హీరో అడవులను కాపాడే వాడు. కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం సినిమా పరిస్థితి అని చెప్పుకొచ్చారు. అడవులను రక్షించడానికి, స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టడానికి వాటికి వ్యతిరేకంగా కన్నడ లెజెండరీ నటుడు రాజ్ కుమార్ గంధడ గుడి సినిమా తీశారని గుర్తు చేశారు. ఇప్పుడు మారిన కల్చర్ ఆందోళన కలిగిస్తోందన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలే నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ కామెంట్స్ పరోక్షంగా అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే అన్నారన్న చర్చ సాగింది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా పవన్ పార్టీ జనసేనకు కాకుండా.. వైసీపీ నంద్యాల అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో అప్పట్లో జనసైనికులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ టార్గెట్‌గా పవన్‌కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న టాక్ సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. అయితే,.. అదేం కాదని..పవన్ జనరల్‌గానే మాట్లాడి ఉంటారని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు జనసైనికులు, పవన్ ఫ్యాన్స్.