ఏపీలో త్వరలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెంపు

ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్‌ విలువలను త్వరలో పెంచనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ శాఖపై నిర్వహించిన సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. కనిష్ఠంగా 10శాతం నుంచి గరిష్ఠంగా 20శాతం వరకు రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచనున్నారు. సాధ్యమైనంతవరకు 10శాతం నుంచి 15 శాతం మధ్యనే పెంపుదల ఉండొచ్చు. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాలవారీగా రిజిస్ట్రేషన్‌ విలువల పెంపుపై నిర్ణయాలు జరుగుతాయి. ఈ ప్రక్రియకు కనీసం 45 రోజుల వరకు పడుతుంది. పెంపు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు నివేదించిన తర్వాత అధికారిక నిర్ణయం వెలువడుతుంది.

ప్రస్తుతం కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్‌ విలువలు ఎక్కువగాను, బహిరంగ మార్కెట్‌ విలువలు తక్కువగాను ఉన్నాయి. వీటినీ సరిదిద్దుతారు. వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు 1న, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి రిజిస్ట్రేషన్‌ విలువలు పెంచుతారు. వైసీపీ పాలనలో 2019లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 10-20శాతం, 2020లో ఎంపికచేసిన పట్టణాల్లో 10-20శాతం, 2022లో జిల్లా కేంద్రాల్లో 20శాతం, 2023లో జాతీయ రహదారులు, ఎంపికచేసిన ప్రదేశాల్లో 20శాతం వరకు విలువలు పెంచారు. . సీఎం ఆమోదం తెలిపిన మేరకు రిజిస్ట్రేషన్‌ విలువల పెంపునకు వీలుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లాలకు ఆదేశాలు వెళ్తాయి.

Latest Articles

రూ. 2,000 అద్దె చెల్లించలేక.. భార్య, కూతురిపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒప్పందం

గుజరాత్‌లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్