విశ్వక్ సక్సెస్ కోసం అలా చేస్తున్నాడా…?

తన సినిమాల కన్నా.. తన మాటలతో ఎక్కువుగా వార్తల్లో ఉండే యంగ్ హీరో విశ్వక్ సేన్. కెరీర్ ఆరంభంలో వరుసగా సక్సెస్ సాధించి… సెన్సేషన్ క్రియేట్ చేసిన విశ్వక్.. ఈమధ్య కాలంలో సరైన హిట్టు లేక సక్సెస్ కోసం తపిస్తున్నాడు. ఇప్పుడు హిట్టు కోసం.. ట్రెండ్ ఫాలో అయి కల్ట్ అంటూ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు. ఇంతకీ.. ఈ మూవీ ఎలా ఉండబోతుంది..? మరి.. ఈ మూవీ అయినా విశ్వక్ కి విజయాన్ని అందిస్తుందా..?

విశ్వక్ సేన్.. డిఫరెంట్ స్టోరీలు.. డిఫరెంట్ ప్రమోషన్స్ చేస్తూ.. ఆడియన్స్ దృష్టిని ఆకర్షించాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్, హిట్.. సినిమాలతో వరుసగా సక్సెస్ సాధించి యూత్ ని బాగా మెప్పించాడు. ఇక అక్కడ నుంచి కథల ఎంపికలో.. క్యారెక్టరైజేషన్లో వైవిధ్యం చూపించాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరీ దేవుడా, దాస్ కా ధమ్కీ తదితర చిత్రాలతో తన మార్క్ చూపించాడు.

అయితే.. ఈమధ్య కాలంలో.. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ, లైలా, ఫంకీ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. కొత్త తరహా సినిమాలు చేయాలని విశ్వక్ తన వంతు ప్రయత్నం చేసాడు కానీ.. కథ, కథనం పై సరిగా కసరత్తు చేయకపోవడం వలన ఆ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. ఇప్పుడు విశ్వక్ సేన్… కల్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి డైరెక్టర్ కూడా విశ్వక్ సేనే కావడం విశేషం. ఆమధ్య ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

ఈ టీజర్ లో క్రూరమైన హత్యలు, రక్తం చిందించే సన్నివేశాలు చూపించారు. అయితే.. ఈమధ్య వయెలెన్స్ ఎక్కువుగా ఉన్న సినిమాలను ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. హిట్ 3, మార్కో, కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2, పుష్ప, పుష్ప 2, సలార్.. తదితర చిత్రాల్లో వయోలెన్స్ ఎక్కువుగా ఉంది. అయినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తుండడం.. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుండడంతో.. ఇది ట్రెండ్ గా మారింది. ఇప్పుడు సక్సెస్ కోసం విశ్వక్ సేన్ వయోలెన్స్ నే నమ్ముకున్నాడు. ఈ మూవీకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాయడం.. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండడం విశేషం. మరి.. ట్రెండ్ ఫాలో అవుతూ చేస్తున్న కల్ట్ మూవీ విశ్వక్ కి విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

Latest Articles

రూ. 2,000 అద్దె చెల్లించలేక.. భార్య, కూతురిపై ఇంటి యజమాని అత్యాచారానికి ఒప్పందం

గుజరాత్‌లోని మోర్బీలో అమానుష ఘటన జరిగింది. అద్దె బకాయిలు చెల్లించలేకపోయిన ఓ వ్యక్తి, తన భార్యతో పాటు మైనర్ కుమార్తెపై ఇంటి యజమాని లైంగిక దాడి చేయడానికి ఒప్పందం చేసుకున్నాడనే ఆరోపణలపై పోలీసులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్