స్వతంత్ర వెబ్ డెస్క్: బ్రిటన్‌లో వారం రోజుల వ్యవధిలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి హత్యకి గురయ్యాడు. క్యాంబర్‌వాల్‌లోని సౌతాంప్టన్ వేలో ఓ నివాస సముదాయంలో కత్తిపోట్ల గాయాలతో పడి ఉన్న అరవింద్ శశికుమార్ అనే 38 ఏళ్ల వ్యక్తిని మెట్రో పోలీసులు గుర్తించారు. కేరళకి చెందిన శశికుమార్‌తో కలిసి ఉండే సల్మాన్ సలీమ్ అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. శశికుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఛాతిపై కత్తిపోట్ల కారణంగానే ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది. క్యాంబెర్‌వెల్ ఎంపీ హారిట్ హార్మన్ మాట్లాడుతూ దీనిని ఒక భయానక ఘటనగా అభివర్ణించారు. మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
బ్రిటన్‌లో మరో భారతీయుడి హత్య
0
347
Previous article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


