జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగోళ్లు

స్వతంత్ర వెబ్ డెస్క్: నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఈ ఏడాది పరీక్షలను నిర్వహించిన గౌహతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ ఉదయం ఫలితాలను విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను jeeadv.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. నాగర్‌కర్నూల్‌కు చెందిన వావిలాల చిద్విలాస్‌ రెడ్డి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలవడం విశేషం. మరోవైపు అమ్మాయిల కేటగిరీలో నాయకంటి నాగ భవ్యశ్రీ టాపర్‌గా నిలిచింది. తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది పరీక్షకు హాజరయ్యారు.

మొత్తం 360 మార్కులకు గాను 341 మార్కులు సాధించిన వావిలాల చిద్విలాస్ రెడ్డి ఆల్‌ఇండియాలో నంబర్‌ వన్‌ ర్యాంక్ సాధించాడు. ఎన్ నాగ భవ్య శ్రీ 360కి 298తో బాలికలలో టాపర్‌గా నిలిచింది. ఉమ్మడి ప్రవేశ పరీక్ష అడ్వాన్స్‌డ్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైనది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్స్‌లో 61వ ర్యాంకు సాధించిన రాజస్థాన్‌కు చెందిన ప్రభవ్ ఖండేల్వాల్ ఈరోజు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో 6వ ర్యాంక్ సాధించాడు.

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్