స్వతంత్ర వెబ్ డెస్క్: అన్ని రాజకీయ పార్టీల చూపు ఖమ్మం(Khammam) వైపే అన్నట్టుగా ఉంది. ఎందుకంటే తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే ఖమ్మంలో యాక్టివ్ పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. రాజకీయ ఎత్తుగడలూ ఎక్కువే.. బీఆర్ఎస్(BRS) అధిష్టానం ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. టికెట్ దక్కని నేతలలో అసంతృప్తి కొనసాగుతుంది. అలాగే మరికొంతమంది అధిష్టానం పై తీవ్ర విమర్శలు చేస్తూ వేరే పార్టీల వైపు చూస్తున్నారు. మరి కొంతమంది రెబల్స్ గా బరిలోకి దిగుతున్నారు. ఎటు చూసినా టిఆర్ఎస్ అధిష్టానం ప్రత్యక్షంగా బరిలోకి దిగిందనే చెప్పవచ్చు.
ఇక నిన్న చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభతో కాంగ్రెస్ లో కొంత ఉత్సాహం పెరిగింది. కొత్త హామీలు ప్రకటించడం వల్ల మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థులలో నమ్మకం ఏర్పడింది. అయితే ఇప్పుడు దాన్ని మించిన స్థాయిలో తమ వ్యూహం ఉండాలని బిజెపి పార్టీ భావిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది, ఏ పార్టీ పథకాలు ఎలా ఉన్నాయి అనేది కంపేర్ చేస్తారు. అప్పుడు బీజేపీ డౌన్ ఉన్నట్లు కనిపిస్తే వారు కాషాయాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉంది. అలా జరగకుండా పక్క ప్లాన్ వేయాలనే ఆలోచనతో నేడు అమిత్ షా(Amith Shah) ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు వస్తున్నారు.
ఈ సభకు రైతు గోస – బీజేపీ భరోసా అని పేరు పెట్టారు. దీని వెనక పెద్ద ఎత్తుగడే ఉంది. తెలంగాణలో ప్రస్తుతం రైతులకు నీటి కొరత, కరెంటు సమస్య లేదుగానీ.. ధరణి సమస్య ఉంది. చాలా మంది రైతులు ధరణిలో భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా అంశాలతో ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని ఇదివరకు హైలెట్ చేసింది. దాంతో ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి.. ధరణిలో కొన్ని మార్పులు చేసింది. మొత్తంగా ధరణి విషయంలో రైతులకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకొని.. రైతులకు అండగా నిలవాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ పాయింట్‌ని బీజేపీ కూడా గట్టిగానే పట్టుకుంది.
ఇవాళ్టి సభను మామూలుగా చెయ్యలేదు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా సెట్ చేశారు. టెక్నాలజీని బాగా వాడుకుంటున్నారు. లక్ష మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ఖమ్మం సిటీలోని ఇల్లందు రోడ్డు – బైపాస్ రోడ్డు వెంట.. SR అండ్ BGNR ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఈ సభ ఉంది. అమిత్ షా.. మధ్యాహ్నం 12 గంటలకు.. ఎయిర్‌పోర్టుకి వస్తారు. తర్వాత హెలికాప్టర్‌లో 3 గంటలకు ఖమ్మం వస్తారు. సాయంత్రం 6.30 దాకా అమిత్ షా.. తెలంగాణలోనే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.