కేసీఆర్ ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయ్.. మరోసారి కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్ స్టార్ క్యాపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి తెలంగాణలో కాంగ్రె‌స్‌(Congress) పార్టీదే విజయమని.. సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉందని.. గెలుస్తుందన్న నమ్మకం ప్రతీ ఒక్కరిలో బలంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్(Brs) సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

మొన్నటివరకు కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తామని ప్రకటించారు. 5 లక్షల మంది టీఆర్టీ కోసం ఎదురుచూస్తున్నారని… కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 2, 3 నెలల్లోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. గ్రామ పంచాయతీలకు కూడా నిధులు ఇవ్వడం లేదని కోమటిరెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
50 వేల కోట్లు కేవలం మద్యం అమ్మకాలపైనే వస్తున్నాయని.. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయంటూ ప్రశ్నించారు. . 24 గంటల కరెంట్‌పై ప్రభుత్వం చెప్పేవన్ని అబద్ధాలని వెల్లడించారు. లాగ్ బుక్స్‌తో అన్నీ బయటపెట్టానని పేర్కొన్న కోమటిరెడ్డి.. మరోసారి సబ్‌స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతా.. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలంటూ సవాల్ విసిరారు.

Latest Articles

ఈటల ఫ్లెక్సీ రచ్చపై స్పందించిన రామచందర్‌రావు.. కొందరు కుట్రలు చేశారు

ఈటెల రాజేందర్ మీద వచ్చిన అభియోగాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామ్ చందర్ రావు స్పందించారు. ఈటెల ఏడుపు బీజేపీకి శాపం అంటూ హైదరాబాద్ లో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. బ్యానర్లు, పోస్టర్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్