41ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీని ఇవాళ కూడా కుంభవృష్టి అతలాకుతలం చేసింది. ఢిల్లీలోని సప్దర్ జంగ్ ప్రాంతంలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై 25 తర్వాత 41 ఏళ్లకు భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. 1958 జూలై 21న ఆల్ టైం హై వర్షపాతం 266.2 మి.మీ రికార్డు అయింది. ఆ తరువాత 2003 జూలై 10న 133.4 మి.మీ వర్షం కురిసింది.

గత రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తం అయింది. నిన్న ఒక్కరోజే 126 మిమీ వర్షం కురిసింది. ఈ నైరుతి సీజన్ లో కురవాల్సిన మొత్తం వర్షపాతంలో 15 శాతం కేవలం 12 గంటల్లోనే కురిసింది. నగరంలో ఎక్కడ చూసినా జలమయం అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తుండడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనే వాహనాలు ప్రయాణిస్తున్నాయి.

ఇదిలా ఉంటే వర్షాలతో ఢిల్లీ అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులందరికీ ఆదివారం సెలవును రద్దు చేశారు. అందురూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈరోజు వర్ష ప్రభావ ప్రాంతాల్లో మంత్రులు, మేయర్ పర్యటించనున్నారు. ఆదివారం కూడా ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వానల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ నిలిచిపోయింది.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్