ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన CCS ACP ఉమామహేశ్వరావును ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఉమా మహేశ్వరరావును తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి ఉమా మహేశ్వరరావును తరలించనున్నారు. ఆయనను నిన్న సాయంత్రం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ్టి నుంచి ఉమామహేశ్వరరావును మూడు రోజుల పాటు విచారించ నున్నారు ఏసీబీ అధికారులు. ఆయన అక్రమాస్తులపై ఆరా తీయనున్నారు. ఉమా మహేశ్వర రావు కస్టడీ విచారణలో.. మరికొంత మంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వర్ రావు నివాసంలో సోదాలు సందర్భంగా భారీగా ఆస్తులు గుర్తించారు. 37 లక్షల నగదు, 60 తులాల బంగారం లభించాయి. దానితో పాటు స్థిర చరాస్తులను గుర్తించారు. ఆస్తుల విలువ మొత్తం 3.95 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకొని ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన విషయాలపై లోతుగా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నించనున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం చంచల్‌గూడా వెళ్లి ఉమామహేశ్వర్‌రావును అదుపులోకి తీసుకోనున్నారు.
ఏసీబీ కస్టడీకి ఏసీపీ ఉమామహేశ్వరరావు
0
203
Previous article
Next article
Latest Articles
విజయసాయిరెడ్డి లక్ష్యం నెరవేరేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా...
- Advertisement -
- Advertisement -


