సినీనటి కాదంబరి జత్వాని పట్ల నీచంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేయటాన్ని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ స్వాగతించారు. చట్టం ప్రకారం వారిని సస్పెండ్ చేయడమే కాదు అరెస్టు కూడా చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు ఐపీఎస్‌ల తీరుతో పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటున్నదని అన్నారు. మహిళలు, దళితుల మీద అనైతిక చర్యలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని డొక్కా డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు ఇలా వ్యవహరించారో వారు మీడియా ముందు చెప్పాలన్నారు. ఈ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్టు చేయాలని డొక్కా అన్నారు.