కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనను హత్య చేయించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. DGP, హోం సెక్రటరీ స్పందించకపోతే రేపు గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు. తనను రేవంత్ రెడ్డి ఎందుకు హత్య చేయాలని అనుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి ప్రశించారు. హామీలపై నిలదీసినందుకు హత్య చేయాలనుకుంటున్నారా.. అని అన్నారు. దాడికి పంపించానని స్వయంగా ముఖ్యమంత్రే మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.