మాజీ సీఎం వైఎస్ జగన్ , అదానీల మధ్య జరిగిన విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేయాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికా లో బయట పడిందన్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రూ.1750 కోట్లు లంచం ఇచ్చినట్టు అమెరికాలో ఛార్జ్‌షీట్ ఫైల్ అయిందన్నారు. ఏసీబీ పారదర్శకంగా అదానీ సోలార్ పవర్‌పై దర్యాప్తు చేయాలని కోరారు. ACB వ్యవస్థను కూటమి ప్రభుత్వం పంజరంలో పెట్టిందని ఆరోపించారు.