దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల అని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం రేవంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం అని చెప్పారు. రూ.10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం… నేడు రూ.5 లక్షలకు చేరుకుందని చెప్పారు. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలనేది తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు తొలి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
0
177
Previous article
Latest Articles
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -
- Advertisement -


