సీఎం జగన్‌ను విమర్శిస్తే గొంతు కోస్తానంటూ ఓ వైసీపీ కార్యకర్తల బెదిరింపులకు పాల్పడ్డారు. కుప్పంలో ఎలా తిరుగుతావో చూస్తా అంటూ గుడిపల్లి మండలం శెట్టిపల్లి సర్పంచ్ రీటా భర్త ఎల్లప్పను బెదిరించారు. అసభ్య పదజాలంతో దూషించి.. గొంతు కోస్తా అంటూ హెచ్చరించాడు. నీది సీఎం జగన్ ను గురించి విమర్శించే స్థాయి కాదని వార్నింగ్ ఇచ్చాడు. బాస్ తనను ఆపుతున్నారు కాబట్టే నువ్వు రోడ్డు పై తిరుగుతున్నావు, లేకుంటే కుప్పంలో అడుగుపెట్టనివ్వను అంటూ బెదిరించాడు. ఎమ్మెల్సీ కంచర్ల, చంద్రబాబు పీఏ మనోహర్.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. నీ అంతు చూస్తా అంటూ హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని బాధితుడు ఎల్లప్ప ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సర్పంచ్ భర్తతోపాటు టిడిపి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయునట్లు సమాచారం. సర్పంచ్ భర్తకు వైసిపి కార్యకర్త వార్నింగ్ వ్యవహారం కుప్పంలో హాట్ టాపిక్ గా మారింది.
చిత్తూరు జిల్లా కుప్పంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త
0
192
Previous article
Next article
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


