గోపాలపురంలో ఇంటర్ విద్యార్థి గ్రేట్ ఆవిష్కరణ

      సాధన ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు. నిజమే, కఠోర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. అయితే, సాధనలు, సుసాధ్యాలు వ్యక్తి ప్రయోజనాలు, కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుండా.. యావత్ సమాజానికి ఉపయోగకరంగా చేయగలిగితే.. ఆ ఆవిష్కర్త ఎంత ధన్యజీవి. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన టీనేజ్ కుర్రాడు తన అనన్య సామాన్య ప్రతిభతో గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుడితే… ఆ బాల మేధావికి సర్కారు, సమాజం ఎంత ప్రోత్సాహం ఇవ్వాలి… ఎంత అండగా ఉండాలి..? అయితే, ఆ పేద మేధావికి ప్రశంసలు తప్ప ఆర్థిక సహకారం అంతంత మాత్రంగానే అందడం శోచనీయం. సైకిల్ ను ఎలక్ట్రికల్ బైసికిల్ గా మార్చి కొంత బంగారు లోకంలో విహరిస్తున్న ఇంటర్ విద్యార్థి గ్రేట్ ఆవిష్కరణ.

     శోకం లోంచి శ్లోకాలు పుట్టి.. మహా కవులుగా, మహనీయులుగా మారి సమాజ ఉద్దరణకు పాల్పడినట్టు మనకు ఎన్నో చరిత్రలు చెబుతున్నాయి. అయితే, నడక కష్టాల నుంచి బయట పడడానికి ఓ ఇంటర్ కుర్రాడు నూతన ఆవిష్కరణ శ్రీకారం చుట్టాడు. తాను ప్రయోజనం పొందడమే కాకుండా.. ఎందరికో ప్రయోజనం కలిగే ఆవిష్కరణ చేపట్టడంతో.. ఆ విద్యార్థిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. గ్రామీణ ప్రాంతా నికి చెందిన నిరుపేద విద్యార్థి పట్టణంలో చదువు కోసం మైళ్లకు మైళ్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. కాలి నడకతో అంత దూరం వెళ్లడం సాధ్యం కాకపోవడంతో సైకిల్ సవారీ మొదలె ట్టాడు. ప్రతి రోజూ పొద్దున్నే సైకిల్ మీద అంత దూరం వెళ్లి, సాయంత్రం తిరిగి రావడంతో… తీవ్రంగా అలిసిపోయేవా డు. బంధు వుల బైక్ మీద ఓ రోజు కళాశాలకు బయల్దేరాడు. అయితే, మైనర్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు.. గట్టిగా మందలించడమే కాకుండా, ఫైన్ లు, చలనాలు వేశారు. అప్పటి నుంచి కళాశాలకు వెళ్లడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఈ సమస్య తన ఒక్కరిదే కాదు… తన ఊళ్లో ఎందరో తనలాంటి వాళ్లు ఉన్నారు. తమ గ్రామమే కాక ఎన్నో మారుమూల గ్రామాల చిన్నారులు, విద్యార్థులు.. పాఠశాల, కళాశాలలకు సుదూర ప్రాంతాలకు కష్టాలు పడి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయని గమనించాడు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకున్నాడు. సైకిల్ ను ఎలక్ట్రికల్ సైకిల్ గా మార్చి..తాను సుఖవంత ప్రయాణం సాగించడమే కాకుండా, ఎందరికో ఆదర్శనీయుడిగా మారాడు.

      మీరు చూస్తున్న ఈ నూనూగు మీసాల కుర్రాడి పేరు హరీష్. ఇంటర్ లోకి ఎంటరైన హరీష్ మహబూబాబాద్ జిల్లా గార్ల ప్రభుత్వ కళాశాలలో తన చదువు కొనసాగిస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన హరీష్ కు ప్రతి నిత్యం వేరే ఊరిలోని కళాశాలకు వెళ్లి రావడం కష్టతరంగా మారింది. దీంతో ఓ పాత సైకిల్ తీసుకుని గార్ల కళాశాలకు వెళ్లేవాడు. మైళ్లకు మైళ్లు సైకిల్ తొక్కి అలసటకు గురవ్వడంతో చదువులో వెనకబడాల్సి వచ్చేది. ఇబ్బడి ముబ్బడిగా ఇంధనం ధర పెరిగిపోవడం, సైకిళ్లపై ఎందరో గ్రామీణ విద్యార్థులు కళాశాలలకు కిలోమీటర్ల మేర వెళుతూండడం, ప్రయాణ కష్టాలతో పిల్లలు చదువుల్లో వెనకబడడం, పేదరికం కారణంతో తల్లిదండ్రులు తమ పిల్లల చదువులు మధ్యలోనే ఆపుచే యడం.. ఈ ఘటనలన్నీ చూసిన హరీష్…తనలా ఇబ్బంది పడుతున్నవారి కోసం కొత్తగా ఏదైనా చేయా లని ఆలోచించాడు. ఆటో మొబైల్ రంగం పై దృష్టి పెట్టాడు. సరికొత్త ఆవిష్కరణకు పునాది వేశాడు. గార్లమండలం గోపాలపురానికి చెందిన కాముని నాగేశ్వరరావు వృత్తి రీత్యా మెకానిక్. ఆయన కుమారుడే హరీష్. గార్ల కళాశాలలో హరీష్ ను ఇంటర్ లో చేర్పించిన నాగేశ్వరరావు, తన కుమారుని సాంకేతిక ప్రతిభ చూసి, మెకానిక్ మెళుకువలను నేర్పించాడు. స్వతహాగా తెలివైనవాడు కావడంతో.. తండ్రి నేర్పించిన మెకానిక్ విద్యలో హరీష్ ఆరితేరాడు.అటు అకడమిక్ చదువులో, ఇటు బైక్ మెకానిజంలో ప్రావీణ్యం సంపాదించాడు.

     ఇంటర్ చదువుకోసం కళాశాలకు పట్నం వెళ్లి వచ్చే సందర్భంలో.. ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయాలనే ఆలోచన హరీష్ కు వచ్చింది. అతి తక్కువ ఖర్చుతో చార్జింగ్ తో నడిచే వాహనాన్ని తయారు చేయాలని భావించాడు. పాత సైకిల్ కు కొన్ని పరికరాలు అమర్చి ఎలక్ట్రిక్ చార్జింగ్ సైకిలు తయారు చేశాడు. కేవలం 12 వేల రూపాయల ఖర్చుతో ఈ నూతన ఆవిష్కరణ చేసి, ఉపయోగకరమైన ఎలక్ట్రిక్ సైకిల్ రూపొందించాడు. క్షణ క్షణం గుర్తు చేసే పేదరికం వల్ల ఖర్చుతో కూడుకున్న ఏ కొత్త వస్తువు కొనాలన్నా ఈ పేద కుటుంబం వెనకడుగు వేసేది. ఇందుకే హరీష్, తన పాత సైకిల్ నే తన నూతన ఆవిష్కరణకు సాధనంగా చేసుకుని ముందుకెళ్లాడు. ఈ సైకిల్ క్వింటాల్ వరకు బరువు మోసే సామర్థ్యం కలిగి ఉంది. ఎలక్ట్రికల్ సైకిల్ కు నాలుగు గంటలు చార్జింగ్ పెడితే 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించవ చ్చు. తన పాత సైకిల్ కు బైక్ లో ఉండే ఆధునిక ఫీచర్లన్నింటినీ హరీష్ అమర్చాడు. యాక్సిలేటర్, బ్రేక్, లైట్, హారన్ తదతరాలతో పాటు నేవిగేషన్ తదితర ఇతర ప్రయోజనాల కోసం స్మార్ట్ వాచ్ ని అమర్చాడు. పేదరికం పాపం, శాపం అంటూ.. నిస్పృహ, నిరాశలతో కూర్చోకుండా ఈ కుటుం బీకులందరు సాంకేతిక విజయాలు సాధిస్తున్నారు. హరీష్‌ సోదరుడు మహేష్ సైతం నూతన ఆవిష్క రణలతో శభాష్ అనిపించుకుంటున్నాడు. డిప్లమా చదువుతున్న మహేష్, దుక్కి దున్నే మినీ ట్రాక్టర్, మినీ జేసీబీని రూపొందించాడు. యాభై నుంచి అరవై కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే దుక్కి దున్నే ట్రాక్టర్ ను మహేష్ తయారు చేశాడు.

Latest Articles

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం – ముగ్గురి దుర్మరణం

కర్ణాటకలో జరిగిన  హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెరువులో బురదలోకి దూసుకెళ్లిన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్