మళ్ళీ రోడ్డెక్కిన గతంలో సీఎం ఎదుట ఆత్మహత్యయత్నం చేసిన మహిళ

స్వతంత్ర, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో గతంలో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎదుట ఆత్మహత్యయత్నం పాల్పడిన ఆరుద్ర అనే మహిళ.. తనకు న్యాయం జరగలేదని మళ్ళీ రోడ్డెక్కింది. అన్నవరం పోలీసులు నుండి కాపాడాలంటూ తన వికలాంగురాలు అయినా కూతురుతో కాకినాడలో మరోమారు నిరసన తెలిపింది. సమస్యలపై శాశ్వత పరిష్కారం కోరుతూ కాకినాడ ధర్నా చౌక్ నందు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంది. అప్పుడు జగన్ మోహన్ రెడ్డి ని కలవనివ్వలేదు.. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.

అనారోగ్యానికి గురైన నా కూతురిని కాపాడాలని అంటే మెర్సీకిల్ ద్వారా కూతురును చంపుకోమని అధికారులు చెప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన.. ధర్నా లు చేసినా… ప్రభుత్వం తరుపున వచ్ఛే లబ్ధి పోతుందంటూ ఎమ్మార్వో మురర్జీ హెచ్చరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నన్ను నా కూతురు దుస్థితి కారణమైన అన్నవరం పోలీసులు పైన కేసులు నమోదు చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని ఆరుద్ర ఆవేదన వెల్లడిస్తున్నారు.

 

 

Latest Articles

నాని లైనప్ మారిందా..?

నేచురల్ స్టార్ నాని.. ప్యారడైజ్ మూవీ కోసం చాలా అంటే చాలా టైమ్ కేటాయించారు. అయినా.. ఇంత వరుకు షూటింగ్ కంప్లీట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసినా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్