ఘోర అగ్నిప్రమాదం… నలుగురు భారతీయులు సహా 16 మంది మృతి

Fire Accedent | దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా 16 మంది మరణించారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దుబాయ్‌లోని అల్ రస్‌ ప్రాంతంలో శనివారం ఈ ప్రమాదం సంభవించినట్టు ‘గల్ఫ్ న్యూస్’ వెల్లడించింది. భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు ఏర్పడగా.. అవి క్రమేణా వ్యాపించి బిల్డింగ్ అంతటా విస్తరించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దుబాయ్ సివిల్ డిఫెన్స్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నివాసితులను హుటాహుటినఅక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనలోమృతి చెందిన నలుగురు భారతీయుల్లో కేరళకు చెందిన దంపతులు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టు స్థానిక మీడియా తెలిపింది. వీరందరూ అదే భవనంలో పనిచేస్తున్నట్టు స్థానిక సామాచారం.

 

Latest Articles

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి కేసీఆర్.. పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి మాజీ సీఎం కేసీఆర్‌ వచ్చారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం డాక్టర్లతో మాట్లాడి పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆరోగ్య...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్