స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసిబి కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు లీగల్ ములాఖత్ ల పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. లీగల్ ములాఖత్ ల సంఖ్యను మూడుకు పెంచాలని చంద్రబాబు లాయర్లు నిన్న పిటిషన్ వేయగా…. ప్రతివాదుల పేర్లు చేర్చకపోవడంతో న్యాయస్థానం కొట్టేసింది. దీంతో రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో లాయర్లకు మూలాఖత్ ఉండనుంది. కాగా, ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ముందస్తు బెయిల్ లభించడం ఖాయమని రఘురామకృష్ణ రాజు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి వైద్య నివేదికలను అందజేయడంలో జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నారని, పొరుగు రాష్ట్రంలోని జైల్లో ఖైదీగా ఉన్న బాబాయికి రెండు నెలల బెయిల్ లభించగా, చంద్రబాబు నాయుడు గారికి స్టాచ్యూరిటీగా లభించే మూలాఖాత్ లను కూడా జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ రెడ్డి గారు రద్దు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.