స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: అమరావతిలో నిజమైన పండుగ జరిగిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అన్నికులాలు, మతాలవారికి యాభైవేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వవద్దని కోరుతున్నారని అన్నారు. పేదలకు ఇల్లు వద్దన్న కమ్యూనిస్టులు ఆంధ్రప్రదేశ్‌లో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఉండరని మండిపడ్డారు. కోర్టు్‌ల్లో సైతం పోరాటం చేసి విజయం సాధించామన్నారు. ఇది పేదల విజయం, సీఎం జగన్ విజయం అంటూ అభివర్ణించారు.